Sunday, 19 April 2026
  • Home  
  • బాల్య వివాహ రహిత జిల్లాగా తిరుపతి-ప్రగతి సంస్థ పిలుపు
- తిరుపతి

బాల్య వివాహ రహిత జిల్లాగా తిరుపతి-ప్రగతి సంస్థ పిలుపు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( బాల్య వివాహాలనే మహమ్మారిని రూపుమాపి, తిరుపతి జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రగతి సంస్థ విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఆదివారం సంస్థ డైరెక్టర్ కేవీ రమణ ఆధ్వర్యంలో పంచాయతీలు, పాఠశాలలు, మత పెద్దలతో కలిసి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సాధారణంగా అక్షయ తృతీయ వంటి పవిత్ర దినాల్లోనే కాకుండా, మహా శివరాత్రి వంటి పర్వదినాల సందర్భాల్లోనూ బాల్య వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, ఆ సమయాల్లో అధికారులు, గ్రామస్థులు మరింత అప్రమత్తంగా ఉండాలని కేవీ రమణ సూచించారు. ఈ అక్రమాలను అరికట్టేందుకు ముందస్తుగా పాఠశాలలు, గ్రామ స్థాయిల్లో కమిటీలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు. వివాహానికి హాజరయ్యే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా చిన్నపిల్లలకు వివాహ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు భాగస్వాములైతేనే ఈ దురాచారాన్ని అరికట్టగలమని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.