Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలని లెక్క చెయ్యని మధిర ఆర్టీసీ డిపో అధికారులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలని లెక్క చెయ్యని మధిర ఆర్టీసీ డిపో అధికారులు

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం పున్నమి ప్రతినిధి మధిర ఆర్టీసీ డిపో విజిటింగ్ పున్నమి రిపోర్టర్ తెలంగాణ ఉప ముఖ్య మంత్రి ఆదేశాలని మధిర డిపో ఆర్టీసీ అధికారులు లెక్క చెయ్యడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
  • మధిర ఆర్టిసి డిపోలో బస్సులు ఆర్డినరీ బస్సులు నడుపుతూ ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది అధిక సర్వీస్ లని విజయవాడ టు ఖమ్మం నడుపుతూ ప్రజలపై భారం మోపుతున్న మధిర ఆర్టీసీ సిబ్బంది.
  • పేరుకి పల్లె వెలుగు బస్సు లు టికెట్ మాత్రం ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయానికులని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

మధిర ఆర్టీసీ డిపో విజిటింగ్ పున్నమి రిపోర్టర్

తెలంగాణ ఉప ముఖ్య మంత్రి ఆదేశాలని మధిర డిపో ఆర్టీసీ అధికారులు లెక్క చెయ్యడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

మధిర ఆర్టిసి డిపోలో బస్సులు ఆర్డినరీ బస్సులు నడుపుతూ ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది

అధిక సర్వీస్ లని విజయవాడ టు ఖమ్మం నడుపుతూ ప్రజలపై భారం మోపుతున్న మధిర ఆర్టీసీ సిబ్బంది.

పేరుకి పల్లె వెలుగు బస్సు లు టికెట్ మాత్రం ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయానికులని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షాత్తు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏ రూటు కి ఎక్కువ ఆదాయం వస్తుందో ప్రతి పల్లెటూరు కలిసే విధంగా బస్సులు నడపమని చెప్పినా కూడా పట్టించుకోని మధిర ఆర్టీసీ అధికారులు.

ఆర్టీసీ సిబ్బంది మహిళలను అని కూడా చూడకుండా డ్యూటీలకి రాత్రి ఒంటిగంట అయినా కూడా పంపించట్లేదు అంటున్న ఆర్టీసీ మహిళా కార్మికులు

మధిర టు వైరా కి సాయంత్రం 6:30 దాటిన తర్వాత ఆర్డినరీ బస్సులు నడపట్లేదు అంటున్న ప్రయాణికులు

మధిర డిపో నందు కార్మికులకు సర్వీస్ ను పెంచి కనీసంగా గ్యాప్ కూడా ఇవ్వట్లేదు అంటున్న ఆర్టీసీ కార్మికులు  ఆవేధన

సాయంత్రం 7:00 దాటితే  మధిర నుండి ఖమ్మం పోవాలి అంటే బస్సులే కరువు అంటున్న ప్రయాణికులు

సమయపాలన లేకుండా సర్వీస్ లని నడుపుతూ న్న వైనం.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు కలుగజేసుకొని టైం టేబుల్ ప్రకారం నడిపి ప్రయాణికులకు ఇబ్బంది పెట్టకుండా బస్సులను నడపాలని కోరుతున్న ప్రజలు

డిపో లోని సగం బస్ లకి ఫిట్ నెస్ లేదని ప్రయాణికుల ఆరోపణలు

మధిర డిపో నుండి మధిర చుట్టుపక్కల మూడు పుణ్యక్షేత్రాలకి బస్సులు నడపమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించినా కూడా ఇంతవరకు మూడు పుణ్యక్షేత్రాలకి బస్సులు నడపటం లేదంటున్న ప్రయాణికులు.

కనీసం ఇప్పటికి ఐన మధిర ఆర్టీసీ డిపో అధికారుల నిర్లక్ష్య వైకరి మీద సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత అయినా ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *