కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం కొట్లూరు పంచాయతీ పరిధిలోని పుష్పాచల కొండపై కార్తీక పౌర్ణమి సందర్భంగా చతుర్థ వార్షిక మహాజ్యోతి దర్శనం, సహస్ర దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. అర్చకులు అంబాబత్తుల అండకొండరాముడు, సర్పంచ్ తేలిదల హేమలత మహాజ్యోతిని వెలిగించారు. శ్రీ పుష్పాచలేశ్వర స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు సమర్పించారు. హరహర మహాదేవ నామస్మరణతో కొండ మార్మోగింది. భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఉత్సవానికి సహకరించిన ట్రస్ట్, దాతలు, భక్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.


