Thursday, 23 April 2026
  • Home  
  • పురాతన ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

పురాతన ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్( ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శ్రీ ఆనందవల్లీ సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో పునరావర్తన జీర్ణోద్ధారణ అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజికవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి, తన మాతృమూర్తి బొజ్జల బృందంమ్మతో కలసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకరాచార్య శ్రీ విద్యానృసింహ భారతీస్వామిని దర్శించుకుని ఆశీస్సులు స్వీకరించారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ఆలయ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, ఆలయ ఈఓ, పాలకమండలి సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై వేడుకలను దర్శించారు. పురాతన ఆలయాల అభివృద్ధి, సంరక్షణకు చర్యలు కొనసాగుతాయని, నియోజకవర్గ ప్రజలకు శివుని కృపాకటాక్షాలు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.