శ్రీ కాళహస్తి, జులై 21, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి, ప్రజా సమస్యలపై చర్చించడానికి మంగళవారం ‘కాఫీ విత్ జనసైనిక్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొట్టే సాయి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చూపిన సిద్ధాంతాలే తమకు మార్గదర్శకమని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమం, సమాజంలో మార్పు కోసం ప్రతి జనసైనికుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు జనసైనికులు స్థానిక సమస్యలు, పార్టీ విస్తరణపై తమ విలువైన సూచనలు, అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యకర్తల ప్రతి సూచనను పార్టీ అభివృద్ధికి ఉపయోగపడేలా అమలు చేయడానికి కృషి చేస్తామని కొట్టే సాయి తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్తామన్నారు. క్రమశిక్షణ, ఐక్యత, సేవాభావంతో ముందుకు సాగితే విజయం తమదేనని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసైనికుడికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా ‘కాఫీ విత్ జనసైనిక్స్’- కొట్టే సాయి