ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఎస్.కే. ఖాదర్ భాషా శనివారం బాధ్యతలు స్వీకరించారు. పొదలకూరు రోడ్డులోని క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఖాదర్ భాషా సేవాభావం, ప్రజలతో మమేకమై పనిచేసే నిబద్ధత సంస్థ సేవా కార్యక్రమాలకు పెద్దగా దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు చేరేటట్లు చర్యలు చేపడతామని తెలిపారు.
నయం కాని వ్యాధులను కూడా విజయవంతంగా నయం చేస్తూ, పేషెంట్లకు ఉచిత భోజన సదుపాయం అందిస్తూ, మానవతా విలువలను నిలబెట్టే కేంద్రంగా నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ పి. లక్ష్మీ, ఎస్.కే. ఆయిషా, దాసరి సుందరం, అరవ రాయప్ప, అరవ ప్రవీణ్ కుమార్, రాచపాలెం రఘు, ఏ. జయరాములు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు

నెల్లూరు రెడ్ క్రాస్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఎస్.కే. ఖాదర్ భాషా బాధ్యతల స్వీకరణ
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఎస్.కే. ఖాదర్ భాషా శనివారం బాధ్యతలు స్వీకరించారు. పొదలకూరు రోడ్డులోని క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఖాదర్ భాషా సేవాభావం, ప్రజలతో మమేకమై పనిచేసే నిబద్ధత సంస్థ సేవా కార్యక్రమాలకు పెద్దగా దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు చేరేటట్లు చర్యలు చేపడతామని తెలిపారు. నయం కాని వ్యాధులను కూడా విజయవంతంగా నయం చేస్తూ, పేషెంట్లకు ఉచిత భోజన సదుపాయం అందిస్తూ, మానవతా విలువలను నిలబెట్టే కేంద్రంగా నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పి. లక్ష్మీ, ఎస్.కే. ఆయిషా, దాసరి సుందరం, అరవ రాయప్ప, అరవ ప్రవీణ్ కుమార్, రాచపాలెం రఘు, ఏ. జయరాములు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు

