నెల్లూరు రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో విశాఖపట్నం క్రీడాకారుల పతకాల పంట
నెల్లూరులో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన 46వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలలో విశాఖపట్నం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. L.V. సుధాకర్ (45+ విభాగం) మూడు పతకాలు సాధించారు. 100 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం, 5 కిలోమీటర్ల నడక పోటీలో కాంస్య పతకం, 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు.
సనపల జయకృష్ణ (40+ విభాగం) 1500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం, 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించారు.
అమరాణి (40+ విభాగం) 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం, 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం, లాంగ్ జంప్‌లో రజత పతకం సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్భంగా విజేతలను పలువురు క్రీడాభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు. వయస్సు పెరిగినా క్రీడలపై ఆసక్తి, పట్టుదల, నిరంతర సాధనతో రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించడం అభినందనీయమని కొనియాడారు.
విజేతలు భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విశాఖపట్నం జిల్లాకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్