వార్త ముఖ్యాంశాలు
- #మా ఆడ బిడ్డ ధైర్యం, తెగువ, సాహసం, సహకార గుణానికి సమస్త తెలుగు సమాజం నీరాజనం నీవు చూపించిన ధైర్యానికి సెల్యూట్ తల్లీ!
- 🔥 అంతా అయిపోయిన తర్వాత ఉక్కుపాదంతో అణిచివేస్తాం, తాట తీస్తాం అంటూ ప్రకటనలు చేయడం కాదు నిజమైన ధైర్యం!
- రంపం మిషన్ చేతబట్టి ఉన్మాదంతో తెగబడుతున్న ఒక దుర్మార్గుడికి ఎదురుగా నిలబడి, తోటి విద్యార్థినిని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి అడ్డుకోవడం అసలైన వీరత్వం.
#మా ఆడ బిడ్డ ధైర్యం, తెగువ, సాహసం,
సహకార గుణానికి సమస్త తెలుగు సమాజం నీరాజనం
నీవు చూపించిన ధైర్యానికి సెల్యూట్ తల్లీ! 🔥
అంతా అయిపోయిన తర్వాత ఉక్కుపాదంతో అణిచివేస్తాం, తాట తీస్తాం అంటూ ప్రకటనలు చేయడం కాదు నిజమైన ధైర్యం!
రంపం మిషన్ చేతబట్టి ఉన్మాదంతో తెగబడుతున్న
ఒక దుర్మార్గుడికి ఎదురుగా నిలబడి,
తోటి విద్యార్థినిని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి అడ్డుకోవడం అసలైన వీరత్వం.
నీ సాహసం, నీ తెగువ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
రాప్తాడు ఘటనలో తోటి విద్యార్థినిపై ఒక వ్యక్తి చేస్తున్న దాడిని అడ్డుకునే ప్రయత్నంలో గాయపడిన విద్యార్థిని లక్ష్మికి హృదయపూర్వక అభినందనలు.
లక్ష్మీ! నీవు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆపదలో ఉన్న తోటి మనిషిని రక్షించేందుకు ముందుకొచ్చే ధైర్యం ప్రతి ఒక్కరిలో రావాలి. మహిళలపై దాడులను అడ్డుకోవడం, బాధితులకు అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత.
నీ ధైర్యానికి మరోసారి సెల్యూట్ తల్లీ 👏