వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చింతంరెడ్డి లోకేశ్ రెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో రాజకీయ వివాదం నెలకొంది.
- ఈ నేపథ్యంలో ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆయన కుమారుడు మేకపాటి అభినవ్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
- సీతారామపురం ఎస్‌ఐ వెంకట రాజేష్‌తో వారు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చింతంరెడ్డి లోకేశ్ రెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో రాజకీయ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆయన కుమారుడు మేకపాటి అభినవ్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సీతారామపురం ఎస్‌ఐ వెంకట రాజేష్‌తో వారు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారని మేకపాటి నేతలు ఆరోపించారు. ఎంపీపీ అభ్యర్థి రేసులో ఉన్న లోకేశ్ రెడ్డి నామినేషన్ తిరస్కరణతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి.