ధర్మవరం గ్రామంలో కూటమి అభ్యర్థి మూలే బాలకృష్ణారెడ్డి సతీమణి మూలే హరితమ్మ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువత, గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ నీరాజనం పట్టారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు, గ్రామీణ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతున్నాయని బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలకు కృషి జరుగుతోందన్నారు. రేపటి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
