వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు, అక్టోబర్ 6 (పున్నమి): మండలంలోని కొత్తపేట గ్రామం మధ్యలో రాకపోకలకు మరియు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ప్రమాదకర విద్యుత్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు వెంటనే తొలగించి, సమస్యను పరిష్కరించారు.
- గ్రామ మధ్యలో వ్రేలాడుతున్న విద్యుత్ వైర్ల వల్ల ఎప్పుడేం జరుగుతుందోనని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతూ వచ్చారు.
- ఈ సమస్యపై స్పందించిన దుత్తలూరు మండల విద్యుత్ శాఖ ఏఈ మరియు వారి సిబ్బంది వెంటనే క్షేత్రస్థాయికి చేరుకున్నారు.
దుత్తలూరు, అక్టోబర్ 6 (పున్నమి):
మండలంలోని కొత్తపేట గ్రామం మధ్యలో రాకపోకలకు మరియు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ప్రమాదకర విద్యుత్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు వెంటనే తొలగించి, సమస్యను పరిష్కరించారు.
గ్రామ మధ్యలో వ్రేలాడుతున్న విద్యుత్ వైర్ల వల్ల ఎప్పుడేం జరుగుతుందోనని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతూ వచ్చారు. ఈ సమస్యపై స్పందించిన దుత్తలూరు మండల విద్యుత్ శాఖ ఏఈ మరియు వారి సిబ్బంది వెంటనే క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న వైర్లను సరిచేసి, కొత్త లైన్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికుల భద్రతకు భరోసా కల్పించారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్న ఏఈ మరియు విద్యుత్ సిబ్బందిని కొత్తపేట గ్రామ ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు.