Thursday, 16 July 2026
  • Home  
  • త్వరలో పేదరికంపై నా పోరాటం: కొప్పాల రఘు*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

త్వరలో పేదరికంపై నా పోరాటం: కొప్పాల రఘు*

*త్వరలో పేదరికంపై నా పోరాటం: కొప్పాల రఘు* *నెల్లూరు జిల్లా:* కాలం మారుతోంది. కానీ పేదరికం మాత్రం మరింత లోతుగా వేళ్లూనుకుంటోంది. నిత్యవసరాల ధరల మోతలో మధ్యతరగతి కుటుంబాలు కుదేలవుతున్నాయి. కూలికి కష్టపడినా, జీతం చేతికి వచ్చినా నెల గడవడం కష్టంగా మారింది. పేద, మధ్యతరగతుల కోసం SC, ST అట్రాసిటీ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు *కొప్పాల రఘు* “పేదరికంపై నా పోరాటం” పేరుతో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. *”ప్రజాస్వామ్యంలో సమానత్వం కాగితాలకే పరిమితం”* ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సమానులని రాజ్యాంగం చెబుతోంది. కానీ వాస్తవంలో పరిస్థితి వేరు అని కొప్పాల రఘు ఆవేదన వ్యక్తం చేశారు. “ఈరోజు *చట్టాలు పేదవాడిని పాలిస్తున్నాయి.* కానీ *ఆ చట్టాలను మాత్రం ధనికులు పాలిస్తున్నారు.* రఘు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్న రోజు రోజుకి ఆర్థిక సంక్షోభంలో నలిగిపోతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల గొంతు ఎవరూ వినడం లేదు” అని ఆయన అన్నారు. *శిక్షణ తరగతుల అనంతరం కార్యాచరణ* ఈ సమస్యలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ముందుగా కమిటీ నేతలు, మహిళా నాయకులతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం “పేదరికంపై నా పోరాటం” కార్యచరణ ప్రణాళికను ప్రకటిస్తామని కొప్పాల రఘు స్పష్టం చేశారు. *వెండిపల్లి శ్రీనివాసులు* జిల్లా ప్రచార కార్యదర్శి SC,ST అట్రాసిటీ పరిరక్షణ కమిటీ నెల్లూరు జిల్లా కార్యాలయం.

*త్వరలో పేదరికంపై నా పోరాటం: కొప్పాల రఘు*

*నెల్లూరు జిల్లా:* కాలం మారుతోంది. కానీ పేదరికం మాత్రం మరింత లోతుగా వేళ్లూనుకుంటోంది. నిత్యవసరాల ధరల మోతలో మధ్యతరగతి కుటుంబాలు కుదేలవుతున్నాయి. కూలికి కష్టపడినా, జీతం చేతికి వచ్చినా నెల గడవడం కష్టంగా మారింది.

పేద, మధ్యతరగతుల కోసం SC, ST అట్రాసిటీ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు *కొప్పాల రఘు* “పేదరికంపై నా పోరాటం” పేరుతో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

*”ప్రజాస్వామ్యంలో సమానత్వం కాగితాలకే పరిమితం”* ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సమానులని రాజ్యాంగం చెబుతోంది. కానీ వాస్తవంలో పరిస్థితి వేరు అని కొప్పాల రఘు ఆవేదన వ్యక్తం చేశారు.

“ఈరోజు *చట్టాలు పేదవాడిని పాలిస్తున్నాయి.* కానీ *ఆ చట్టాలను మాత్రం ధనికులు పాలిస్తున్నారు.* రఘు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్న రోజు రోజుకి ఆర్థిక సంక్షోభంలో నలిగిపోతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల గొంతు ఎవరూ వినడం లేదు” అని ఆయన అన్నారు.

*శిక్షణ తరగతుల అనంతరం కార్యాచరణ*
ఈ సమస్యలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ముందుగా కమిటీ నేతలు, మహిళా నాయకులతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం “పేదరికంపై నా పోరాటం” కార్యచరణ ప్రణాళికను ప్రకటిస్తామని కొప్పాల రఘు స్పష్టం చేశారు.

*వెండిపల్లి శ్రీనివాసులు*
జిల్లా ప్రచార కార్యదర్శి
SC,ST అట్రాసిటీ పరిరక్షణ కమిటీ
నెల్లూరు జిల్లా కార్యాలయం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.