వార్త ముఖ్యాంశాలు
- *నువ్వూరుపాడు పంచాయతీ* *తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్న గడ్డం వారి కుటుంబం* నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, నువ్వూరుపాడు పంచాయతీ, పాత జంగాలపల్లి SC కాలనీకి చెందిన కటారి సుబ్బరాయుడు అనే వ్యక్తి ఈరోజు తీవ్ర అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ సందర్భంగా పాత జంగాలపల్లి గ్రామస్థుడు...
- స్వర్గీయ *గడ్డం విజయ భాస్కర్ రెడ్డి గారు గత నాలుగేళ్లుగా నువ్వూరుపాడు పంచాయితీలో మరణించిన వారి అంత్య క్రియల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు తమ వంతుగా 5000/- రూపాయలు తక్షణ ఆర్థిక సహాయాన్ని ఆనవాయితీగా అందజేస్తూ వచ్చారు విజయ భాస్కర్ రెడ్డి గారు అనారోగ్యంతో ఇటీవల…
- ఈ విధంగా కష్ట కాలంలో తమకు ఆర్థిక సహాయం అందించినందుకు మృతుడి కుటుంబ సభ్యులు, మరియు పాత జంగాలపల్లి SC కాలనీ వాసులు గడ్డం శ్రీనివాసులు రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
*నువ్వూరుపాడు పంచాయతీ*
*తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్న గడ్డం వారి కుటుంబం*
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, నువ్వూరుపాడు పంచాయతీ, పాత జంగాలపల్లి SC కాలనీకి చెందిన కటారి సుబ్బరాయుడు అనే వ్యక్తి ఈరోజు తీవ్ర అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ సందర్భంగా పాత జంగాలపల్లి గ్రామస్థుడు… స్వర్గీయ *గడ్డం విజయ భాస్కర్ రెడ్డి గారు గత నాలుగేళ్లుగా నువ్వూరుపాడు పంచాయితీలో మరణించిన వారి అంత్య క్రియల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు తమ వంతుగా 5000/- రూపాయలు తక్షణ ఆర్థిక సహాయాన్ని ఆనవాయితీగా అందజేస్తూ వచ్చారు విజయ భాస్కర్ రెడ్డి గారు అనారోగ్యంతో ఇటీవల అకాల మరణం చెందడంతో ఆయన జ్ఞాపకార్ధంగా వారి సోదరుడు గడ్డం శ్రీనివాసులు రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మృతుడు కటారి సుబ్బరాయుడు కుటుంబ సభ్యులకు రూ 5000/- తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.పై కార్యక్రమంలో సుభహాన్, శ్రీరాములు రెడ్డి, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా కష్ట కాలంలో తమకు ఆర్థిక సహాయం అందించినందుకు మృతుడి కుటుంబ సభ్యులు, మరియు పాత జంగాలపల్లి SC కాలనీ వాసులు గడ్డం శ్రీనివాసులు రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.