Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

తండ్రికి తగ్గ తనయుడు.. హైకోర్టు అడ్వకేట్‌గా భూక్య తేజస్ ప్రమాణ స్వీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తండ్రికి తగ్గ తనయుడు.. హైకోర్టు అడ్వకేట్‌గా భూక్య తేజస్ ప్రమాణ స్వీకారం

వార్త ముఖ్యాంశాలు

  • తండ్రికి తగ్గ తనయుడు..
  • హైకోర్టు అడ్వకేట్‌గా భూక్య తేజస్ ప్రమాణ స్వీకారం!
  • గిరిజన హక్కుల పోరాట యోధుడి వారసుడిగా న్యాయరంగంలోకి అడుగు..

తండ్రికి తగ్గ తనయుడు.. హైకోర్టు అడ్వకేట్‌గా భూక్య తేజస్ ప్రమాణ స్వీకారం!

గిరిజన హక్కుల పోరాట యోధుడి వారసుడిగా న్యాయరంగంలోకి అడుగు.. మహబూబాబాద్‌కు గర్వకారణం

మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ భూక్య నెహ్రూ నాయక్, పద్మ దంపతుల కుమారుడు భూక్య తేజస్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం చేసి న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ విద్యను పూర్తి చేసిన తేజస్ ప్రస్తుతం కేశవ్ మెమోరియల్ కాలేజీలో ఎల్‌ఎల్‌ఎం (క్రిమినాలజీ) అభ్యసిస్తూ తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు.

తండ్రి భూక్య నెహ్రూ నాయక్ గతంలో లంబాడి హక్కుల పోరాట సమితిని స్థాపించి, రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం అనేక ఉద్యమాలు చేపట్టి క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన సమాజ సేవే లక్ష్యంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి మహబూబాబాద్ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించారు.

తండ్రి ప్రజాసేవా మార్గంలో నడుస్తూ, న్యాయవాద వృత్తిని ఎంచుకున్న తేజస్ భవిష్యత్తులో పేదలు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులకు న్యాయం అందించే దిశగా ముందుకు సాగాలని పట్టణ ప్రజలు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.

తండ్రి చేసిన సామాజిక పోరాటాలు ఒకవైపు.. కుమారుడు ఎంచుకున్న న్యాయ సేవా మార్గం మరోవైపు.. ఈ కుటుంబం సమాజానికి అందిస్తున్న సేవలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా భూక్య తేజస్ న్యాయరంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.
కుమారుడు హైకోర్టు అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం చేయడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ప్రజాసేవా వారసత్వానికి కుమారుడి న్యాయవృత్తి తోడవడంతో మహబూబాబాద్ పట్టణంలో ఈ విషయం ఆనందాన్ని కలిగిస్తోంది.

పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్
మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *