26-10-2026 *డోర్నకల్:*
■ డోర్నకల్ మండల కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ మౌనిక యశోధర్ జైన్ గారి నివాసంలో నల్గొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి యువతతో ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు,
ఈ సందర్భంగా యశోధర్ జైన్ గారితో పాటు పలువురితో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయించిన *మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ..*
*కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి*
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తోంది. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడాలి
*కేసీఆర్ పాలనలో రైతులకు భరోసా..*
*కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు*
గతంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచారు, సాగునీరు, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్, ఎరువులు, విత్తనాల లభ్యతకు ప్రాధాన్యత ఇచ్చారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే వ్యవస్థకు ప్రాధాన్యత ఉండేది. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
సాగుకు అవసరమైన వనరుల కొరత, విద్యుత్, నీటి సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి,
*పెరిగిన ధరలతో సామాన్యుడి బతుకు భారంగా మారింది*
దసరా పండుగ ముగిసిన తర్వాత కూడా సామాన్య ప్రజల కష్టాలు తగ్గడం లేదు, బియ్యం, పంచదార, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. చిన్న వ్యాపారులు, చిరు ఉద్యోగులు, కూలీలు, రైతులు పెరిగిన ఖర్చులతో సతమతమవుతున్నారు
ఒకవైపు ఆదాయం పెరగకపోగా, మరోవైపు నిత్యావసరాల ధరలు పెరగడంతో కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారింది
డోర్నకల్ ప్రాంతం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే కార్మికులు, వ్యాపారులు, చిరు వ్యాపారాలతో ప్రత్యేకమైన ప్రాంతంగా ఉంది. ఇక్కడి ప్రజలు, వ్యాపారులు పరస్పర సహకారంతో కుటుంబ సభ్యుల్లా జీవిస్తున్నారు. కానీ పెరిగిన ధరలు అందరిపైనా ప్రభావం చూపుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో వ్యాపారాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి
*ప్రజా సమస్యలపై ప్రశ్నించాలి.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి*
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి, రైతుల సమస్యలు, నిరుద్యోగుల ఆవేదన, పెరిగిన నిత్యావసరాల ధరలు, సామాన్యుల ఆర్థిక ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా సరైన తీర్పు ఇచ్చేలా అవగాహన కల్పించాలి
కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు, పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి. ప్రజల సమస్యలపై పోరాడుతూ, ప్రజలకు అండగా నిలుస్తూ, బీఆర్ఎస్ పార్టీకి తిరిగి ప్రజాదరణ తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలి అన్నారు
ఈ కార్యక్రమంలో డోర్నకల్ మండల బిఆర్ఎస్ నాయకులు పాండు నాయక్, వెంకట్ రెడ్డి, యశోధర్ జైన్, కొత్త వీరన్న, రాము, గౌస్, ఠాగూర్, గణేష్ సింగ్, రామచంద్ర, మన్యు ప్యాట్నీ, ఐక్య రాజ్, వినయ్ చంద్ర, బోడ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్