Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేట మాదిగ కుటుంబానికి చెందిన మరియమ్మ న్యాయం చేయాలని ఎమ్మెస్ పి నా రాష్ట్ర నాయకుల కోట దానియేలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జగ్గయ్యపేట మాదిగ కుటుంబానికి చెందిన మరియమ్మ న్యాయం చేయాలని ఎమ్మెస్ పి నా రాష్ట్ర నాయకుల కోట దానియేలు

*యండ్రాతి మరియమ్మ మృతిపై న్యాయం చేయాలి – బాధిత కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు వెంటనే అందించాలి: MRPS–MSP డిమాండ్*

యండ్రాతి మరియమ్మ మృతి ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను వెంటనే అందించాలని కోరుతూ MRPS–MSP ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా MRPS–MSP నాయకులు మాట్లాడుతూ.. యండ్రాతి మరియమ్మ మృతి ఘటనపై కేసును వేగవంతంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్ట ప్రకారం కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారంతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అందించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు MRPS–MSP అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో MSP రాష్ట్ర నాయకులు కోట దానియేల్ మాదిగ, NTR జిల్లా MSP మాజీ ఉపాధ్యక్షులు మాతంగి దావీదు మాదిగ, జగ్గయ్యపేట మండల MRPS ఇంచార్జ్ చింతిరాల గోపి మాదిగ, MRPS జగ్గయ్యపేట మండల నాయకులు అమ్మనబోయిన రారాజు మాదిగ, పెనుగంచిప్రోలు మండల MRPS ఇంచార్జ్ ప్రొద్దుటూరు రాజశేఖర్ మాదిగ, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

MRPS–MSP నాయకులు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

జగ్గయ్యపేట మాదిగ కుటుంబానికి చెందిన మరియమ్మ న్యాయం చేయాలని ఎమ్మెస్ పి నా రాష్ట్ర నాయకుల కోట దానియేలు

జగ్గయ్యపేట మాదిగ కుటుంబానికి చెందిన మరియమ్మ న్యాయం చేయాలని ఎమ్మెస్ పి నా రాష్ట్ర నాయకుల కోట దానియేలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *