వైరా / ఖమ్మం
వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలం పెద్దమునగాల గ్రామంలో భారతీయ జనతా పార్టీ (BJP) ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బండారు నరేష్ మేనకోడళ్లు చిరంజీవి కార్తిక, చిరంజీవి మన్విత నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ పాలేరు నియోజకవ ఇంచార్జి నున్న రవికుమార్ కార్తిక, మన్వితలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కోటి హనుమంతరావు, కొణిజర్ల మండల అధ్యక్షులు మురళీకృష్ణ, మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



