వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు మండలం దుత్తలూరు గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చల్లా ప్రసాద్ కమ్మవారిపాలెంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
- గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటున్నారు.
- గ్రామాభివృద్ధికి తనకు ఒక్క అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.
దుత్తలూరు మండలం దుత్తలూరు గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చల్లా ప్రసాద్ కమ్మవారిపాలెంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటున్నారు. గ్రామాభివృద్ధికి తనకు ఒక్క అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో కుటుంబ సభ్యులు, యువకులు పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా చల్లా ప్రసాద్ మాట్లాడుతూ సర్పంచిగా తనను గెలిపిస్తే గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.