Tuesday, 2 June 2026
  • Home  
  • గురు గ్రహ మార్పు-శ్రీకాళహస్తిలో వైభవంగా గురుదక్షిణామూర్తి స్వామివారి శంఖాభిషేకం
- తిరుపతి

గురు గ్రహ మార్పు-శ్రీకాళహస్తిలో వైభవంగా గురుదక్షిణామూర్తి స్వామివారి శంఖాభిషేకం

శ్రీ కాళహస్తి, జూన్ 03, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి మంగళవారం నాడు గురు గ్రహ మార్పు మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ తృతీయ, మూలా నక్షత్ర యుక్త శుభలగ్నాన ఉదయ కాలంలో నవగ్రహములలో పంచమ గ్రహమైన శ్రీ గురు గ్రహము మిధున రాశి నుండి కర్కాటక రాశి లోనికి ప్రవేశించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం ప్రత్యేక సంకల్పం, విశేషమైన అష్టోత్తర శత శంఖాభిషేకము, నైవేద్య సమర్పణ, దీపారాధన మరియు ఆకర్షణీయ అలంకార సేవలను శాస్త్రోక్తంగా జరిపారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు ఈ పూజా కార్యక్రమాలను శాస్త్రబద్ధంగా పూర్తి చేశారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడిన ఈ వేడుకలో ఆలయ పరిపాలన అధికారి (ఈఓ) బికే వెంకటేశ్వర్లు, పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, ప్రముఖ సినీ నటుడు సప్తగిరి, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, దేవస్థాన సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.