Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గన్నేపల్లి పంచాయతీలో బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి విస్తృత ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గన్నేపల్లి పంచాయతీలో బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్థి విస్తృత ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరి జడ్పీటీసీ బీఎస్పీ అభ్యర్థి గన్నేపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
  • పంచాయతీ పరిధిలోని గ్రామాలు, కాలనీల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు.
  • బీఎస్పీ సిద్ధాంతాలు, ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు.

ఉదయగిరి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉదయగిరి జడ్పీటీసీ బీఎస్పీ అభ్యర్థి గన్నేపల్లి పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని గ్రామాలు, కాలనీల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. బీఎస్పీ సిద్ధాంతాలు, ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బీఎస్పీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రజలను ఓటు అభ్యర్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *