Friday, 2 October 2026
  • Home  
  • *కొటికలపూడి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు గ్రేస్ మినిస్ట్రీస్ చొరవతో ల్యాప్‌టాప్ బహూకరణ:* ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 1: భారత్ న్యూస్… ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యేనని, మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కంప్యూటర్ మరియు సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో ఉండాలని అమెరికా దేశ ప్రతినిధులు లిండ్సే, అలెక్స్ పేర్కొన్నారు. కొటికలపూడి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (ZPHS) గురువారం కేతనకొండ గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కంప్యూటర్ అవసరాల నిమిత్తం రూ. 40,000/- ల విలువ గల అత్యాధునిక ల్యాప్‌టాప్‌ను వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా అమెరికా దాతలు లిండ్సే, అలెక్స్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ఎదగాలని ఆకాంక్షించారు. నేటి డిజిటల్ యుగంలో టెక్నాలజీపై పట్టు సాధించడం ఎంతో అవసరమని సూచించారు. అనంతరం వారు విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించి, వారికి స్నాక్స్ పంపిణీ చేశారు. గ్రామీణ విద్యార్థుల నైపుణ్యాల పెంపే లక్ష్యం: గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎలీషా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పేద విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానాన్ని మరింత చేరువ చేయడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యార్థులను నైపుణ్యం కలిగిన ఉత్తమ సమాజ సేవకులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రతినిధులు రెండు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు స్ఫూర్తిని నింపారు. ఈ అభినందనీయ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.వి. మాలిని, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఎస్ఎంసీ (SMC) చైర్మన్ జెస్సికా, గ్రేస్ మినిస్ట్రీస్ సెక్రటరీ సుమలతతో పాటు పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాలకు ల్యాప్‌టాప్ విరాళంగా అందించిన దాతలకు, గ్రేస్ మినిస్ట్రీస్ ప్రతినిధులకు హెచ్ఎం మాలిని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
- ఎన్ టి ఆర్ జిల్లా

*కొటికలపూడి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు గ్రేస్ మినిస్ట్రీస్ చొరవతో ల్యాప్‌టాప్ బహూకరణ:* ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 1: భారత్ న్యూస్… ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యేనని, మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కంప్యూటర్ మరియు సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో ఉండాలని అమెరికా దేశ ప్రతినిధులు లిండ్సే, అలెక్స్ పేర్కొన్నారు. కొటికలపూడి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (ZPHS) గురువారం కేతనకొండ గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కంప్యూటర్ అవసరాల నిమిత్తం రూ. 40,000/- ల విలువ గల అత్యాధునిక ల్యాప్‌టాప్‌ను వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా అమెరికా దాతలు లిండ్సే, అలెక్స్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ఎదగాలని ఆకాంక్షించారు. నేటి డిజిటల్ యుగంలో టెక్నాలజీపై పట్టు సాధించడం ఎంతో అవసరమని సూచించారు. అనంతరం వారు విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించి, వారికి స్నాక్స్ పంపిణీ చేశారు. గ్రామీణ విద్యార్థుల నైపుణ్యాల పెంపే లక్ష్యం: గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎలీషా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పేద విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానాన్ని మరింత చేరువ చేయడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యార్థులను నైపుణ్యం కలిగిన ఉత్తమ సమాజ సేవకులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రతినిధులు రెండు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు స్ఫూర్తిని నింపారు. ఈ అభినందనీయ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.వి. మాలిని, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఎస్ఎంసీ (SMC) చైర్మన్ జెస్సికా, గ్రేస్ మినిస్ట్రీస్ సెక్రటరీ సుమలతతో పాటు పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాలకు ల్యాప్‌టాప్ విరాళంగా అందించిన దాతలకు, గ్రేస్ మినిస్ట్రీస్ ప్రతినిధులకు హెచ్ఎం మాలిని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

*కొటికలపూడి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు గ్రేస్ మినిస్ట్రీస్ చొరవతో ల్యాప్‌టాప్ బహూకరణ:*

ఎన్టీఆర్ జిల్లా.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 1: భారత్ న్యూస్…

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యేనని, మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కంప్యూటర్ మరియు సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో ఉండాలని అమెరికా దేశ ప్రతినిధులు లిండ్సే, అలెక్స్ పేర్కొన్నారు. కొటికలపూడి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (ZPHS) గురువారం కేతనకొండ గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కంప్యూటర్ అవసరాల నిమిత్తం రూ. 40,000/- ల విలువ గల అత్యాధునిక ల్యాప్‌టాప్‌ను వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా అమెరికా దాతలు లిండ్సే, అలెక్స్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ఎదగాలని ఆకాంక్షించారు. నేటి డిజిటల్ యుగంలో టెక్నాలజీపై పట్టు సాధించడం ఎంతో అవసరమని సూచించారు.
అనంతరం వారు విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించి, వారికి స్నాక్స్ పంపిణీ చేశారు.
గ్రామీణ విద్యార్థుల నైపుణ్యాల పెంపే లక్ష్యం:
గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎలీషా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పేద విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానాన్ని మరింత చేరువ చేయడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు.
విద్యార్థులను నైపుణ్యం కలిగిన ఉత్తమ సమాజ సేవకులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రతినిధులు రెండు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు స్ఫూర్తిని నింపారు.
ఈ అభినందనీయ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.వి. మాలిని, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఎస్ఎంసీ (SMC) చైర్మన్ జెస్సికా, గ్రేస్ మినిస్ట్రీస్ సెక్రటరీ సుమలతతో పాటు పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠశాలకు ల్యాప్‌టాప్ విరాళంగా అందించిన దాతలకు,
గ్రేస్ మినిస్ట్రీస్ ప్రతినిధులకు హెచ్ఎం మాలిని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.