వార్త ముఖ్యాంశాలు
- -రూరల్‌లోని 36 డివిజన్లలో వైసీపీకి ఒక్క స్థానమూ దక్కలేదు -రూ.966 కోట్ల అభివృద్ధి పనులే విజయానికి కారణం -ప్రజల తీర్పును దుర్వినియోగం చేయం..
- అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం -వైసీపీ నేతలు విజయకుమార్ రెడ్డి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకోవాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి -ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: మేయర్ రూప్‌కుమార్ యాదవ్ --సమావేశంలో రూరల్ విజేతల పరిచయ కార్యక్రమం నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీలు సాధించిన చారిత్రాత్మక విజయం ప్రజలకు…
- శుక్రవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నగర మేయర్ పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
-రూరల్‌లోని 36 డివిజన్లలో వైసీపీకి ఒక్క స్థానమూ దక్కలేదు
-రూ.966 కోట్ల అభివృద్ధి పనులే విజయానికి కారణం
-ప్రజల తీర్పును దుర్వినియోగం చేయం.. అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం
-వైసీపీ నేతలు విజయకుమార్ రెడ్డి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకోవాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
-ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: మేయర్ రూప్‌కుమార్ యాదవ్
–సమావేశంలో రూరల్ విజేతల పరిచయ కార్యక్రమం
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీలు సాధించిన చారిత్రాత్మక విజయం ప్రజలకు కూటమి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నగర మేయర్ పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
రూరల్‌లో వైసీపీకి ఒక్క స్థానమూ దక్కలేదు!
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36 డివిజన్లలో వైసీపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఈ విజయానికి కారణమన్నారు. మేయర్ అభ్యర్థిని రికార్డు మెజారిటీతో గెలిపించడం ద్వారా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
రూ.966 కోట్ల అభివృద్ధికి ప్రజల ఆశీర్వాదం!
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.966 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తించి ప్రజలు కూటమిని ఆశీర్వదించారని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలే ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డాయని చెప్పారు. వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి సొంత 5 వ డివిజన్‌లోనూ ఆ పార్టీ విజయం సాధించలేకపోవడం ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ప్రజల తీర్పును దుర్వినియోగం చేయం!
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన విజయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయబోమని కోటంరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
దౌర్జన్యాల ఆరోపణలకు కోటంరెడ్డి కౌంటర్!
కూటమి దౌర్జన్యాలకు పాల్పడిందనే ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. నిజంగా దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలిచి ఉంటే అనంతపురం, నాయుడుపేటల్లో కూటమి ఎందుకు ఓటమి చెందుతుందని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియను అధికారులు నిష్పక్షపాతంగా నిర్వహించారని, ప్రజల తీర్పును గౌరవించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ మేయర్ అభ్యర్థి విజయకుమార్ రెడ్డి సైతం ఎన్నికల నిర్వహణను అభినందించారని గుర్తుచేశారు.
జగన్ సహా వైసీపీ నేతలకు రాజకీయ పాఠాలు!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నాయకులందరూ తమ మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకోవాలని కోటంరెడ్డి సూచించారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించి ప్రజల తీర్పును గౌరవించడం రాజకీయ నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: రూప్‌కుమార్ యాదవ్
నెల్లూరు నగర మేయర్‌గా తనకు భారీ మెజారిటీతో విజయాన్ని అందించిన ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు రూప్‌కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందించిన సహాయ సహకారాలు, వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తన విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నగర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.
–రూరల్ విజేతల పరిచయ కార్యక్రమం
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రురల్ నియోజకవర్గ పరిధిలో మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన 36 మంది కూటమి విజేతలను పేరు పేరునా సభకు పరిచయం చేసారు .
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , నందిమండలం భాను శ్రీ తదితరులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్