వార్త ముఖ్యాంశాలు
- --ఈవీఎం ఐనా ..
- బ్యాలెట్ ఐనా గెలుపు కూటమిదే!
- --2024 ఎన్నికలను మించిన విజయాన్ని అందించిన ప్రజలు --స్థానిక ఎన్నికలపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు --జడ్పీ, పంచాయతీ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగిస్తాం --టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారనడానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని…
–ఈవీఎం ఐనా .. బ్యాలెట్ ఐనా గెలుపు కూటమిదే!
–2024 ఎన్నికలను మించిన విజయాన్ని అందించిన ప్రజలు
–స్థానిక ఎన్నికలపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
–జడ్పీ, పంచాయతీ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగిస్తాం
–టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారనడానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్ర పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా, బ్యాలెట్ పేపర్లతో నిర్వహించినా ప్రజల తీర్పు కూటమికే అనుకూలంగా ఉంటోందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల విజయాన్ని మించిన ప్రజాదరణ ప్రస్తుతం కూటమికి లభిస్తోందని తెలిపారు.
ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు!
స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారని బీద రవిచంద్ర ఆరోపించారు. రిజర్వేషన్ల అంశాన్ని వివాదాస్పదం చేసి న్యాయస్థానాలను ఆశ్రయించారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఓటర్ల జాబితాల విషయంలోనూ అనవసర వివాదాలు సృష్టించారని పేర్కొన్నారు. ఎన్నికలను ఏ ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించాలన్న నిర్ణయం ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు.
కేంద్ర నిధులు కోల్పోకుండా ఎన్నికలు!
కొత్త ఓటర్ల జాబితా కోసం ఎదురుచూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమై కేంద్ర నిధులు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయించే ఏ ఓటర్ల జాబితాతోనైనా ఎన్నికలకు సిద్ధమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
2021 ఎన్నికలను జగన్ గుర్తుచేసుకోవాలి!
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విమర్శలు చేస్తున్న జగన్ ముందుగా 2021 ఎన్నికల తీరును గుర్తుచేసుకోవాలని సూచించారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారులను కులాల పేరుతో విమర్శించి ఒత్తిడికి గురిచేశారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల వ్యవస్థపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదని విమర్శించారు.
అభివృద్ధికే ప్రజలు పట్టం!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వివరించారు. ఈ పాలనపై విశ్వాసంతోనే ప్రజలు కూటమికి మద్దతు ఇచ్చారన్నారు .
మున్సిపల్ ఎన్నికల విజయాన్ని మించిన ఫలితాలను జడ్పీ, మండల , పంచాయతీ ఎన్నికల్లో సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు మానుకోవాలని సూచించారు. కూటమికి మద్దతిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, పిల్ రావు, మనుబోలు శ్రీధర్‌రెడ్డి, మాతంగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్