వార్త ముఖ్యాంశాలు
- రోడ్డుపై ఇనుపకమ్ములు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్ కలువాయి, నవంబరు 17 (పున్నమి): నెల్లూరు జిల్లా కలువాయిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
- స్థానిక శివసాయి కళాశాల సమీపంలో పార్శిల్ లారీ నుంచి కూలీలు ఇనుపకమ్ములను కిందకు దించుతున్న సమయంలో అటుగా బైక్పై వెళ్తున్న నూకనపల్లికి చెందిన లంకా మహేష్ రెడ్డి ప్రమాదానికి గురయ్యాడు.
- ఇనుపకమ్ములు తగలడంతో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది.
రోడ్డుపై ఇనుపకమ్ములు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్
కలువాయి, నవంబరు 17 (పున్నమి):
నెల్లూరు జిల్లా కలువాయిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక శివసాయి కళాశాల సమీపంలో పార్శిల్ లారీ నుంచి కూలీలు ఇనుపకమ్ములను కిందకు దించుతున్న సమయంలో అటుగా బైక్పై వెళ్తున్న నూకనపల్లికి చెందిన లంకా మహేష్ రెడ్డి ప్రమాదానికి గురయ్యాడు. ఇనుపకమ్ములు తగలడంతో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మహేష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.