Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలిగిరి మండలంలో బీఎస్పీ అభ్యర్థి పుష్పాంజలి ఎన్నికల ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కలిగిరి మండలంలో బీఎస్పీ అభ్యర్థి పుష్పాంజలి ఎన్నికల ప్రచారం

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని కలిగిరి మండలంలో క్రాకటూరు జెడ్పీటీసీ అభ్యర్థి పుష్పాంజలి బీఎస్పీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను కలిసి పార్టీ విధానాలను వివరించారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఆమె తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారాన్ని కొనసాగించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.

కలిగిరి మండలంలో బీఎస్పీ అభ్యర్థి పుష్పాంజలి ఎన్నికల ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *