వార్త ముఖ్యాంశాలు
- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, సెప్టెంబర్ 30: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండకూడదని డాక్టర్ బి.ఆర్.
- అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా.
- ఆర్.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం, సెప్టెంబర్ 30: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండకూడదని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ త్రైమాసిక సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు, అదనపు ఎస్పీ మహేంద్ర మత్తె తదితరులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, శ్మశాన వాటికలకు రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. శ్మశాన వాటికల భూములను రీ-సర్వేలో గుర్తించి హద్దులు నిర్ణయించాలని తెలిపారు.
మైనర్ బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, విదేశాల్లో ఉపాధి పొందుతున్న తల్లిదండ్రుల పిల్లల సంరక్షణపై పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లలో పరిశుభ్రత, నాణ్యమైన భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
ప్రతి నెల 30న పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ఎస్సీ, ఎస్టీ హక్కులు, చట్టపరమైన రక్షణలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.