ఉదయగిరి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు. స్క్రూటినీ సమయంలో అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ఇతర అభ్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలుంటే సంబంధిత అధికారికి తెలియజేయవచ్చు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ విడత ఎన్నికలకు నవంబర్ 29న పోలింగ్ నిర్వహించనున్నారు.
