వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు ప్రశాంతంగా సాగింది.
- సర్పంచ్ స్థానానికి ఒకటి, వార్డు సభ్యుల స్థానాలకు 11 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల నిర్వహణ అధికారి టి.
- సుకుమార్ తెలిపారు.
ఉదయగిరి మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు ప్రశాంతంగా సాగింది. సర్పంచ్ స్థానానికి ఒకటి, వార్డు సభ్యుల స్థానాలకు 11 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల నిర్వహణ అధికారి టి. సుకుమార్ తెలిపారు. గండిపాలెం సర్పంచ్ స్థానానికి ఒక నామినేషన్ దాఖలైంది. అదే గ్రామంలోని ఎనిమిది వార్డులకు నామినేషన్లు వచ్చాయి. ఉదయగిరి, కొండాయపాలెం, జి. అయ్యవారిపల్లి గ్రామ పంచాయతీల్లో ఒక్కో వార్డు స్థానానికి నామినేషన్ దాఖలైనట్లు ఆయన వెల్లడించారు.