Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఈరోజు టిడిపి సీనియర్ నాయకుడు గరికపాటి శివ సేవలు కొన్ని ఆడిన ఎమ్మెల్యేవసంత వెంకటకృష్ణ ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈరోజు టిడిపి సీనియర్ నాయకుడు గరికపాటి శివ సేవలు కొన్ని ఆడిన ఎమ్మెల్యేవసంత వెంకటకృష్ణ ప్రసాద్

టీడీపీ సీనియర్ నాయకులు గరికపాటి శివ సేవలు చిరస్మరణీయం.

మూలపాడులో గరికపాటి శివ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు.

పార్టీకి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం:

ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి శివ మృతి పార్టీకి తీరని లోటని మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు.

మూలపాడు గ్రామంలో నిర్వహించిన గరికపాటి శివ సంస్మరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గరికపాటి శివ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా గరికపాటి శివ తెలుగుదేశం పార్టీకి అందించిన సేవలను, పార్టీ పటిష్టత కోసం చేసిన కృషిని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు స్మరించుకున్నారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. పార్టీకి కష్టకాలంలోనూ అండగా నిలిచి, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల కోసం పనిచేసిన నాయకుడిగా ఆయనను గుర్తుచేసుకున్నారు.

గరికపాటి శివ మరణం పార్టీ కుటుంబానికి, స్థానిక నాయకులకు, కార్యకర్తలకు తీరని లోటని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారితో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గరికపాటి శివ కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొని నివాళులర్పించార

ఈరోజు టిడిపి సీనియర్ నాయకుడు గరికపాటి శివ సేవలు కొన్ని ఆడిన ఎమ్మెల్యేవసంత వెంకటకృష్ణ ప్రసాద్

ఈరోజు టిడిపి సీనియర్ నాయకుడు గరికపాటి శివ సేవలు కొన్ని ఆడిన ఎమ్మెల్యేవసంత వెంకటకృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *