ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆర్టీఓ రాములు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాలెం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న గొల్లపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలిని నెల్లూరు నుంచి ఉదయగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో బాధితురాలిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆర్టీఓ రాములు వివరాలు సేకరించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
