Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరులో వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరులో వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, అక్టోబర్‌ 26 (కోటకొండ హరికిరణ్‌ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్‌ ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీకి చెందిన మరో కీలక నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరారు.
  • వైఎస్సార్‌సీపీ డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు, శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల అధినేతలు డాక్టర్‌ ప్రణీత్‌, డాక్టర్‌ హారిక, డాక్టర్‌ వెంకటేశ్వర్లు తమ అనుచరులు, అభిమానులతో కలిసి సోమవారం ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం వారికి టీడీపీ కండువాలు…
  • దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

టీడీపీలో చేరిన వైసీపీ డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ప్రణీత్‌

మంత్రి ఆనం సమక్షంలో డాక్టర్‌ ప్రణీత్‌, డాక్టర్‌ హారిక, డాక్టర్‌ వెంకటేశ్వర్లు చేరిక

ఆత్మకూరు, అక్టోబర్‌ 26 (కోటకొండ హరికిరణ్‌ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపల్‌ ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీకి చెందిన మరో కీలక నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు, శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల అధినేతలు డాక్టర్‌ ప్రణీత్‌, డాక్టర్‌ హారిక, డాక్టర్‌ వెంకటేశ్వర్లు తమ అనుచరులు, అభిమానులతో కలిసి సోమవారం ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైద్యరంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో గుర్తింపు పొందిన డాక్టర్‌ ప్రణీత్‌ కుటుంబానికి చెందిన వైద్యులు, వారి అనుచరులు టీడీపీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. డాక్టర్‌ ప్రణీత్‌తో పాటు చేరిన వైద్యులు, వారి అనుచరుల వివరాలు ఎన్నికల వేళ రాజకీయ చర్చకు దారితీశాయి.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, యువ నాయకులు చల్లా రవికుమార్‌రెడ్డి, బొమ్మిరెడ్డి తారక్‌నాథరెడ్డి, డాక్టర్‌ కోడూరు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కాటంరెడ్డి రవీంద్రరెడ్డి ,బుజ్జిరెడ్డి పాల్గొన్నారు మరియు శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల సిబ్బంది, ఇతర నాయకులు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *