Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి పరామర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • అమెరికాలో రోడ్డు ప్రమాదం..
  • మరిపెడకు చెందిన సుప్రియ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేసిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు 05-10-2026 అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ…

For scrolling /publish

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మరిపెడకు చెందిన సుప్రియ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేసిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు

05-10-2026

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన దారం సుప్రియ మృతి చెందారు, ఉద్యోగ రీత్యా అమెరికాలో నివాసం ఉంటున్న సుప్రియ, స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి వెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది,ఈ ఘటనలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందారు

ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు సుప్రియ తండ్రితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు,ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

అనంతరం ఎమ్మెల్సీ తాతా మధు గారితో ఫోన్‌లో మాట్లాడిన సత్యవతి రాథోడ్ గారు, అమెరికాలోని తానా సభ్యులతో సమన్వయం చేసుకుని సుప్రియ మృతదేహాన్ని త్వరితగతిన స్వగ్రామానికి తీసుకువచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు

సుప్రియ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, మరిపెడ ప్రాంత ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు, ఈ విషాద సమయంలో సుప్రియ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు తెలిపా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *