Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • నర్సంపేట అంగడి సెంటర్ నెహ్రూ పార్క్ వద్ద షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంలో రెండు దుకాణాలు దగ్ధమై రూ.
  • 25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిన ఘటనా స్థలాన్ని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.
  • గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సందర్శించారు.

నర్సంపేట అంగడి సెంటర్ నెహ్రూ పార్క్ వద్ద షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంలో రెండు దుకాణాలు దగ్ధమై రూ. 25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిన ఘటనా స్థలాన్ని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సందర్శించారు.
​బాధితులను పరామర్శించి, ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన వారికి ధైర్యం చెప్పారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదంపై విచారణ జరిపి, ప్రభుత్వ పరంగా తగిన పరిహారం అందించాలని కోరారు. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాడతానని హామీ ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో నాయకులు గూడూరు సందీప్, తనుగుల అంబేద్కర్, జూలూరు మనీష్ గౌడ్, వీరన్న, రాజు, సమ్మయ్య, సందీప్ యాదవ్, విగ్నేష్ గౌడ్, సరిత, విజయ సింగ్, నాగేంద్రబాబు, అన్వేష్, రాకేష్, అనిల్, అజీమ్, తరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Publicపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *