Wednesday, 23 September 2026
  • Home  
  • *🔵 సూళ్లూరుపేటలో రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమబాట*
- తిరుపతి

*🔵 సూళ్లూరుపేటలో రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమబాట*

*సూళ్లూరుపేటలో రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమబాట* సూళ్లూరుపేట, సెప్టెంబరు 21: రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సాధన కోసం పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించాలని కోరుతూ అంబేద్కర్ ధర్మపోరాట సమితి (ఏడీఎస్) ఆధ్వర్యంలో సోమవారం సూళ్లూరుపేటలో ఆందోళన నిర్వహించారు. ఏడీఎస్ ఆంధ్ర రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎర్రబోతు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తొలుత పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రబోతు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు చేపట్టే పాలకులు రాజ్యాంగంలోని మౌలిక విలువలకు అనుగుణంగా ప్రజాపాలన సాగించాలని అన్నారు. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర స్ఫూర్తిని పాలనలో ఆచరణలోకి తీసుకురావాలని కోరారు. ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ, విద్య, వైద్య రంగాల్లో ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్తులు, ప్రజాధనం, ప్రకృతి వనరులను పరిరక్షించాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఏడీఎస్ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి పట్టణ పురవీధుల మీదుగా ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న నాయకులు తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. తమ విజ్ఞప్తిని ఉన్నతాధికారుల దృష్టికి, భారత రాష్ట్రపతికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూరగ మనోహర్, ఎద్దల సుబ్రహ్మణ్యం, ఆవుల దాస్, ఆవుల చెంగయ్య, తడ వెంకటేశ్వర్లు, కే. రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

*సూళ్లూరుపేటలో రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమబాట*

సూళ్లూరుపేట, సెప్టెంబరు 21: రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సాధన కోసం పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించాలని కోరుతూ అంబేద్కర్ ధర్మపోరాట సమితి (ఏడీఎస్) ఆధ్వర్యంలో సోమవారం సూళ్లూరుపేటలో ఆందోళన నిర్వహించారు.

ఏడీఎస్ ఆంధ్ర రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎర్రబోతు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తొలుత పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఎర్రబోతు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు చేపట్టే పాలకులు రాజ్యాంగంలోని మౌలిక విలువలకు అనుగుణంగా ప్రజాపాలన సాగించాలని అన్నారు. రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర స్ఫూర్తిని పాలనలో ఆచరణలోకి తీసుకురావాలని కోరారు.

ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ, విద్య, వైద్య రంగాల్లో ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్తులు, ప్రజాధనం, ప్రకృతి వనరులను పరిరక్షించాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఏడీఎస్ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.

అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి పట్టణ పురవీధుల మీదుగా ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న నాయకులు తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. తమ విజ్ఞప్తిని ఉన్నతాధికారుల దృష్టికి, భారత రాష్ట్రపతికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బూరగ మనోహర్, ఎద్దల సుబ్రహ్మణ్యం, ఆవుల దాస్, ఆవుల చెంగయ్య, తడ వెంకటేశ్వర్లు, కే. రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.