శ్రీకాళహస్తి, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల రక్షణే ధ్యేయంగా సోమవారం నాడు భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని మహేష్ కళ్యాణ మండపంలో ఉదయం 9:30 గంటల నుండి జరిగిన ఈ సదస్సుకు సుమారు 400 మంది మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మహిళల చట్టపరమైన హక్కులు, బాల్య వివాహాల నివారణ, బాలల దుర్వినియోగం, గృహ హింస వంటి కీలక అంశాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, న్యాయ నిపుణులు మరియు విద్యావేత్తలు మాట్లాడుతూ.. మహిళలు తమకు అందుబాటులో ఉన్న భద్రతా వ్యవస్థలను, చట్టాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో వివరించారు. సమాజంలో మహిళలు చైతన్యవంతులైనప్పుడే సురక్షితమైన సమాజ నిర్మాణం సాధ్యమని, ఏదైనా ఆపద కలిగితే తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. మహిళలను చైతన్యపరచడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది.

శ్రీకాళహస్తి పోలీసుల ఆధ్వర్యంలో ‘మహిళా చైతన్యం