Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

వైద్య రంగంలో ప్రతిభ సాధించిన ఐనాల సాయి లిఖిత కు ఘనంగా సన్మానం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైద్య రంగంలో ప్రతిభ సాధించిన ఐనాల సాయి లిఖిత కు ఘనంగా సన్మానం.

వార్త ముఖ్యాంశాలు

  • *పిపిఎల్ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు* *మరిపెడ*:- వైద్య రంగంలో ప్రతిభ సాధించి మెడిసిన్ లో సీటు సాధించిన ఐనాల సాయి లిఖిత కు పీపీఎల్ కార్యాలయంలో ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం.మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల…
  • ఈ సందర్భంగా ఐనాల పరశురాములు మాట్లాడుతూ వైద్య రంగంలో ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి చేరుకొని కన్న తల్లితండ్రులకు, కుటుంబానికి, ఊరుకు మంచిపేరు తెచ్చి పేద, నిరుపేదలకు ఆరోగ్య సేవలను తక్కువ ఖర్చు తో అందించాలని వైద్య విద్యార్థిని ఐనాల సాయి లిఖిత ను కోరారు.
  • సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ లోని పిపిఎల్ కార్యాలయంలో ఖమ్మం జిల్లా వైరా మండలం, కేజీ సిరిపురం గ్రామానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు ఐనాల సైదులు- జానకి దంపతుల చిన్న కుమార్తె ఐనాల సాయి లిఖిత ఇటివల వెలువడిన నీట్ - 2026 ఫలితాల్లో…

*పిపిఎల్ రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు*

*మరిపెడ*:- వైద్య రంగంలో ప్రతిభ సాధించి మెడిసిన్ లో సీటు సాధించిన ఐనాల సాయి లిఖిత కు పీపీఎల్ కార్యాలయంలో ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం.మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఇంచార్జీ, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు పాల్గొని ఘనంగా సన్మానించి,ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఐనాల పరశురాములు మాట్లాడుతూ వైద్య రంగంలో ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి చేరుకొని కన్న తల్లితండ్రులకు, కుటుంబానికి, ఊరుకు మంచిపేరు తెచ్చి పేద, నిరుపేదలకు ఆరోగ్య సేవలను తక్కువ ఖర్చు తో అందించాలని వైద్య విద్యార్థిని ఐనాల సాయి లిఖిత ను కోరారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ లోని పిపిఎల్ కార్యాలయంలో ఖమ్మం జిల్లా వైరా మండలం, కేజీ సిరిపురం గ్రామానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు ఐనాల సైదులు- జానకి దంపతుల చిన్న కుమార్తె ఐనాల సాయి లిఖిత ఇటివల వెలువడిన నీట్ – 2026 ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి హైదరాబాద్ రామంతాపూర్ లోగల జే ఎస్ పి ఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల సీటు సాధించింది. ఇప్పటికే ఈ దంపతుల పెద్ద కుమార్తె ఐనాల సౌగంది యశస్విని ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతుంది. వీరిద్దరూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలో ఇంటర్ వరకు చదివి నీట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఇద్దరూ ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడిసిన్ లో సీట్లు సాధించడం గర్వకారణం అని అన్నారు. ఐనాల సైదులు ముదిగొండ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల లో ప్రభుత్వ అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీపీఎల్ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తల్లితండ్రులు ఐనాల సైదులు, జానకి,పీపీఎల్ జోనల్ నాయకులు మిడతపల్లి జగన్, నాయకులు మట్టే మధు. బల్లెం ఎల్లయ్య,నవత, సుజాత తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *