తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం, విశాఖ సహా పలు జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రాత్రి ఒంటిగంటకు పోలాకి వద్ద వాయుగుండం తీరం దాటనుండటంతో ఈనెల 24, 25 తేదీల్లో యంత్రాంగమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రేపు పాఠశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించాలని, ప్రజలకు తాగునీరు, ఆహారం, మందులు, విద్యుత్ కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో దెబ్బతిన్న వరి పంట నష్టాన్ని అంచనా వేయాలని, మత్స్యకారులను వెనక్కి రప్పించాలని సీఎం సూచించారు.

వర్షాలు తగ్గేవరకు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు