జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల తెలిపారు. ఆమె ఆదేశాల మేరకు ముఖ్య కూడళ్ళు, హైవేలు, ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. జిల్లాను 6 డివిజన్లుగా విభజించి హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. హైవేల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని, ప్రామాణిక హెల్మెట్ ద్వారా ప్రాణ రక్షణ సాధ్యమని, అత్యవసర పరిస్థితుల్లో 112కు సంప్రదించాలని పోలీసులు సూచించారు.



