Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మంచిర్యాల

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత

వార్త ముఖ్యాంశాలు

  • బెల్లంపల్లి నవంబర్ 23 : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగరేణి కార్మికుడి కుటుంబానికి బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు కోటి రూపాయల బీమా చెక్కును శనివారం నాడు అందజేసింది.
  • గత మార్చి 23వ తేదీన బొక్కలగుట్ట రాళ్లవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కె కె 5 గనిలో పనిచేసే సింగరేణి కార్మికుడు పోసిని వెంకటస్వామి(45) మరణించాడు.
  • స్థానిక హనుమాన్ బస్తీకి చెందిన వెంకటస్వామికి బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు లో జీతం ఖాతా ఉండడం వల్ల అతని నామినిగా ఉన్న భార్య సుమలతకు కోటి రూపాయల బీమా చెక్కును బ్యాంకు చీఫ్ మేనేజర్ చందన్ కుమార్, సీనియర్ మేనేజర్ తరుణ్ సింగ్, బ్యాంకు ఆర్డీవో విజయ్…

బెల్లంపల్లి నవంబర్ 23 : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగరేణి కార్మికుడి కుటుంబానికి బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు కోటి రూపాయల బీమా చెక్కును శనివారం నాడు అందజేసింది. గత మార్చి 23వ తేదీన బొక్కలగుట్ట రాళ్లవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కె కె 5 గనిలో పనిచేసే సింగరేణి కార్మికుడు పోసిని వెంకటస్వామి(45) మరణించాడు. స్థానిక హనుమాన్ బస్తీకి చెందిన వెంకటస్వామికి బెల్లంపల్లి యూనియన్ బ్యాంకు లో జీతం ఖాతా ఉండడం వల్ల అతని నామినిగా ఉన్న భార్య సుమలతకు కోటి రూపాయల బీమా చెక్కును బ్యాంకు చీఫ్ మేనేజర్ చందన్ కుమార్, సీనియర్ మేనేజర్ తరుణ్ సింగ్, బ్యాంకు ఆర్డీవో విజయ్ సంజయ్ చేతుల మీదుగా ఈ బీమా డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు చీఫ్ మేనేజర్ చందన్ కుమార్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు లో ఖాతా కలిగిన ప్రతి ఒక్క బ్యాంకు వినియోగదారుడు ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా కోరారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *