Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

నంద్యాల: మహిళలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, రొమ్ములో వచ్చే మార్పులను తొలిదశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు.
నంద్యాలలోని క్యాంపు కార్యాలయంలో ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ వింగ్, నంద్యాల అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన రొమ్ముల స్వీయ పరీక్ష అవగాహన కరపత్రాన్ని మంత్రి ఫరూక్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆవిష్కరించారు. ప్రతి మహిళ నెలకు ఒకసారి స్వీయ పరీక్ష చేసుకోవాలని, గడ్డలు లేదా ఇతర మార్పులు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని మంత్రి సూచించారు.అక్టోబర్ 3న ఉదయం 10 గంటలకు మున్సిపల్ టౌన్ హాల్ నుంచి టేక్కే మార్కెట్ యార్డ్ వరకు పింక్ వాకథాన్ నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు వి. అనిల్ కుమార్, వి. హరిత, ఎస్. వసుధరణి, పి. సునీత పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *