Tuesday, 22 September 2026
  • Home  
  • రైతుల సమస్యలపై నిరంతరం పోరాటం: నెల్లూరి కోటేశ్వరరావు..
- ఖమ్మం

రైతుల సమస్యలపై నిరంతరం పోరాటం: నెల్లూరి కోటేశ్వరరావు..

వేంసూర్ / ఖమ్మం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలోని బీజేపీ సీనియర్ నాయకులు దొడ్డపునేని కృష్ణయ్య వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు హాజరయ్యారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరుకుళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ కిసాన్ మోర్చా రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవీ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, పాలేరు నియోజకవర్గ ఇంచార్జి నున్నా రవి, మందడపు సుబ్బారావు, వల్లభనేని పుల్లయ్య, మండేపూడి వీర నాగేశ్వరరావు, అపతి వెంకటరామారావు, సుదర్శన్ మిశ్రా, పడిగల మధు, ఓరుగంటి రాము, ప్రభాకర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, గంధసిరి వీరభద్రం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

వేంసూర్ / ఖమ్మం

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలోని బీజేపీ సీనియర్ నాయకులు దొడ్డపునేని కృష్ణయ్య వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు హాజరయ్యారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరుకుళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ కిసాన్ మోర్చా రైతుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవీ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, పాలేరు నియోజకవర్గ ఇంచార్జి నున్నా రవి, మందడపు సుబ్బారావు, వల్లభనేని పుల్లయ్య, మండేపూడి వీర నాగేశ్వరరావు, అపతి వెంకటరామారావు, సుదర్శన్ మిశ్రా, పడిగల మధు, ఓరుగంటి రాము, ప్రభాకర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, గంధసిరి వీరభద్రం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.