Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రుద్రకోట ఎన్నికల ప్రచారంలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రుద్రకోట ఎన్నికల ప్రచారంలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో సోమవారం నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కావలి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప్పాల సింధుజ (జనసేన), ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్న జరుగుమల్లి సుజాత (తెలుగుదేశం)లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో రుద్రకోట ప్రజలు తనకు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 600కు పైగా మెజార్టీ అందించారని గుర్తుచేశారు. అదే ఆదరాభిమానాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

రుద్రకోటలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బీపీసీఎల్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందేలా కృషి చేశామని, ప్రాజెక్టు ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఓటు అనే ఆయుధంతో కూటమి అభ్యర్థుల విజయాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసిందన్నారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డితో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రుద్రకోట ఎన్నికల ప్రచారంలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

రుద్రకోట ఎన్నికల ప్రచారంలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *