Saturday, 18 April 2026
  • Home  
  • రాజీవ్ నగర్‌కు ‘రెగ్యులర్ వీఆర్వో’ను నియమించండి-తహశీల్దార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ వినతి
- తిరుపతి

రాజీవ్ నగర్‌కు ‘రెగ్యులర్ వీఆర్వో’ను నియమించండి-తహశీల్దార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ వినతి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి మండల పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో ఎదురవుతున్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల సంక్షేమ సంస్థ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ రవీంద్ర శనివారం శ్రీకాళహస్తి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణం కలిగిన రాజీవ్ నగర్‌కు గత ఏడాది కాలంగా రెగ్యులర్ విఆర్వో లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా ఆయన తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వెంకటగిరి మండలంలో విధులు నిర్వహిస్తున్న అధికారికి ఇక్కడ అదనపు బాధ్యతలు అప్పగించారని, ఆయన దూర ప్రాంతంలో ఉండటం వల్ల స్థానిక సమస్యలకు సకాలంలో స్పందించలేకపోతున్నారని రవీంద్ర వివరించారు. దీనివల్ల ఫిర్యాదుల పరిష్కారం ఆలస్యమవుతోందని, అత్యవసర సమయాల్లో అధికారులు అందుబాటులో లేక ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ ప్రాంతంలో భూ ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టి వంటి అక్రమాలు పెరుగుతున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం సమీప ప్రాంత అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించాల్సి ఉన్నా, ఆ విధానం అమలు కాకపోవడంతో పరిపాలన కుంటుపడుతోందని పేర్కొన్నారు.ప్రస్తుత ఇన్‌చార్జ్ అధికారిని బాధ్యతల నుంచి విముక్తి కల్పించి, రాజీవ్ నగర్‌కు వెంటనే రెగ్యులర్ వీఆర్వోను నియమించాలని లేదా సమీప సచివాలయ అధికారినికైనా బాధ్యతలు అప్పగించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలపై ప్రత్యేక విచారణ జరిపి ప్రజలకు తక్షణ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రవీంద్ర రెవెన్యూ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.