Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ జిల్లా SIR కన్వీనర్ భూక్యా శ్యాం సుందర్ నాయక్…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం, జూలై 1: (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్ ) ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.
  • ఎస్.
  • దివాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో, అలాగే ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న SIR (Special Intensive Revision) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఖమ్మం, జూలై 1:
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

ఖమ్మం జిల్లా కలెక్టర్ టి. ఎస్. దివాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో, అలాగే ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న SIR (Special Intensive Revision) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా SIR కన్వీనర్ భూక్య శ్యాంసుందర్ నాయక్ పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం అమలు, ప్రజలకు అవగాహన కల్పించడం, అర్హులైన ప్రతి ఓటరిని నమోదు చేయడం, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై సమావేశంలో అధికారులు వివరణ ఇచ్చారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *