చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండ గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కలగుట్ట తండ యువతకు ఇచ్చిన హామీని సర్పంచ్ విక్రమ్ నెరవేర్చారు. వినాయక చవితి పండుగ సందర్భంగా యువత కోసం రూ.42,000 విలువైన మైక్‌సెట్‌ను ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి స్ఫూర్తితో బహూకరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో నక్కలగుట్ట తండ యువతకు ఇచ్చిన హామీ మేరకు మైక్‌సెట్‌ను అందజేసినట్లు తెలిపారు. ప్రజాసేవలో ముందుండి పనిచేయాలనే స్ఫూర్తిని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి నుంచి పొందుతున్నానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానన్నారు.
మైక్‌సెట్‌ను అందజేసిన సర్పంచ్ విక్రమ్‌కు నక్కలగుట్ట తండ యువకులు, గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేశ్, మాజీ సర్పంచ్ గణేష్, కేశ్య, జెత్య నాయక్, కిషన్, శంకర్, శ్రీను, రాజు, బద్రు, చందు, నక్కలగుట్ట తండ యువకులు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

యువతకు అండగా సర్పంచ్ విక్రమ్.42వేల విలువ గల మైక్ సెట్ బహుకారణ
చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండ గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కలగుట్ట తండ యువతకు ఇచ్చిన హామీని సర్పంచ్ విక్రమ్ నెరవేర్చారు. వినాయక చవితి పండుగ సందర్భంగా యువత కోసం రూ.42,000 విలువైన మైక్‌సెట్‌ను ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి స్ఫూర్తితో బహూకరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో నక్కలగుట్ట తండ యువతకు ఇచ్చిన హామీ మేరకు మైక్‌సెట్‌ను అందజేసినట్లు తెలిపారు. ప్రజాసేవలో ముందుండి పనిచేయాలనే స్ఫూర్తిని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి నుంచి పొందుతున్నానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానన్నారు. మైక్‌సెట్‌ను అందజేసిన సర్పంచ్ విక్రమ్‌కు నక్కలగుట్ట తండ యువకులు, గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేశ్, మాజీ సర్పంచ్ గణేష్, కేశ్య, జెత్య నాయక్, కిషన్, శంకర్, శ్రీను, రాజు, బద్రు, చందు, నక్కలగుట్ట తండ యువకులు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

