Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

మీ బిడ్డగా ఆశీర్వదించండి.. 102వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా! – కూటమి అభ్యర్థి గవర సోమశేఖర్ హామీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మీ బిడ్డగా ఆశీర్వదించండి.. 102వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా! – కూటమి అభ్యర్థి గవర సోమశేఖర్ హామీ

విశాఖపట్నం, అక్టోబర్ 23 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో గాజువాక నియోజకవర్గం 102వ వార్డు కూటమి అభ్యర్థి గవర సోమశేఖర్ పెదమడక గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా గవర సోమశేఖర్ మాట్లాడుతూ.. తనను సొంత బిడ్డలా ఆదరించి, ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. 102వ వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. తనతో పాటు కూటమి మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణికి కూడా ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధే ప్రధాన లక్ష్యం

వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సోమశేఖర్ హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

పెదమడక గ్రామంలో ప్రచారం సందర్భంగా స్థానికులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల ప్రజలు ఆయనకు స్వాగతం పలికి మద్దతు ప్రకటించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని సోమశేఖర్ కోరారు.

కూటమి శ్రేణుల ఉత్సాహం

ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గంతకోరు అప్పారావు, అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, జనసేన నాయకులు పాముల వసంత్, బుదిరెడ్డి అప్పారావు, శ్రీమతి రాజారత్నం, బీజేపీ వార్డు అధ్యక్షుడు కోసూరి తాతారావు, స్థానిక నాయకులు కరణం సన్నీ, గొట్ట్యాడ నగేష్, టీడీపీ వార్డు మహిళా అధ్యక్షురాలు గీత పాల్గొన్నారు. టీడీపీ మహిళలు, జనసేన వీరమహిళలు, బీజేపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.

మీ బిడ్డగా ఆశీర్వదించండి.. 102వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా! – కూటమి అభ్యర్థి గవర సోమశేఖర్ హామీ

మీ బిడ్డగా ఆశీర్వదించండి.. 102వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా! – కూటమి అభ్యర్థి గవర సోమశేఖర్ హామీ

మీ బిడ్డగా ఆశీర్వదించండి.. 102వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా! – కూటమి అభ్యర్థి గవర సోమశేఖర్ హామీ

మీ బిడ్డగా ఆశీర్వదించండి.. 102వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా! – కూటమి అభ్యర్థి గవర సోమశేఖర్ హామీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *