వార్త ముఖ్యాంశాలు
- మహాముత్తారం: ఈరోజు మహాముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్లతో సమావేశమై, ఇటీవల మండల అభివృద్ధి కోసం మంజూరైన నిధుల గురించి చర్చించారు.ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల అభివృద్ధికి…
- ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన పనులకు ప్రాధాన్యతనిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని జాడి రాజయ్య పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు సర్పంచ్లు, కాంగ్రెస్…
మహాముత్తారం: ఈరోజు మహాముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్లతో సమావేశమై, ఇటీవల మండల అభివృద్ధి కోసం మంజూరైన నిధుల గురించి చర్చించారు.ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల అభివృద్ధికి నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన అంశాలపై సర్పంచ్లతో చర్చించారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన పనులకు ప్రాధాన్యతనిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని జాడి రాజయ్య పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్