సాయిబాబా కాలనీలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే
ఎల్‌బీనగర్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎల్‌బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని సాయిబాబా కాలనీలో భవాని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు, సామాజిక ఐక్యతకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు, భవాని యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

