నంద్యాల : రాష్ట్రంలోని బూటకపు ప్రభుత్వాన్ని ఓడించి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నంద్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మున్సిపాలిటీ పరిధిలోని 29 నుండి 42వ వార్డుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ తప్పుడు హామీలను ఇంటింటికీ తిరిగి ఎండగట్టాలని, వార్డు స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైయస్సార్సీపీ కార్యకర్తలు దేనికీ భయపడరని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో విజయం కోసం శ్రమించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాష, ముఖ్య నాయకులు, మాజీ కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

బూటకపు ప్రభుత్వాన్ని భూస్థాపితం చేద్దాం: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి