Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

బాసర శారదీయ (దసరా) శరన్నవరాత్రి మహోత్సవాలు ఐదవ రోజు స్కందమాతా అలంకార దర్శనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాసర శారదీయ (దసరా) శరన్నవరాత్రి మహోత్సవాలు ఐదవ రోజు స్కందమాతా అలంకార దర్శనం

అక్టోబర్ 15 పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా జ్ఞాన సరస్వతి దేవస్థానం నవరాత్రులలో ఐదవ రోజున ‘స్కందమాత స్వరూపంలో అమ్మవారు ఆరాధించబడుతుంది.
స్కందభగవానుడి తల్లి అయినందున అమ్మవారి ఈ రూపానికి స్కందమాత అని పేరు. సింహవాహనంపై ఉంటుంది చేతిలో కమలం, జలకలశం, ఘంటా ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా *స్కందుడు(కుమారస్వామి) ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతా దేవి. కనుక ‘పద్మాసన’గా ప్రసిద్ధికెక్కినది. ఈమె సింహ వాహనంపై ఉంటుంది. స్కందమాతను ఆరాధిస్తే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. నైవేద్యం : పెరుగన్నం
స్కందమాత ధ్యాన శ్లోకం :
సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ||

బాసర శారదీయ (దసరా) శరన్నవరాత్రి మహోత్సవాలు ఐదవ రోజు స్కందమాతా అలంకార దర్శనం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *